కర్నూలు జిల్లా కోసిగి ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద తుంగభద్ర నదిలో స్నానానికి దిగి, నలుగురు మృతి చెందారు. పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు కర్ణాటకలోని మాన్వికి చెందిన 15 మంది 2 రోజుల క్రితం కందుకూరు గ్రామానికి వచ్చారు. వివాహం ముగిసిన తర్వాత శుక్రవారం ఉదయం తుంగభద్ర నదిలో స్నానం చేసేందుకు వెళ్లారు. ఈత రాక నలుగురు నీటమునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారని సమాచారం•













