-ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ చొరవతో గూడూరు సహకార సంఘం ఆదర్శంగా – అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి

నెల్లూరు జిల్లా: గూడూరు నెం.24 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహా జనసభ సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశానికి సంఘం అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి అధ్యక్షత వహించారు. సమావేశంలో మాట్లాడుతూ ఆయన గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ సేవలను ప్రశంసలతో ముంచెత్తారు. అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ చొరవతో మరియు నిరంతర సహకారంతో గూడూరు పరిధిలోని రైతులకు ఇప్పటివరకు ఎటువంటి ఎరువుల కొరత లేకుండా అందించగలిగామని తెలిపారు. రైతుల అవసరాలను ముందుగానే గుర్తించి సరైన సమయంలో ఎరువులు అందించడంలో ఎమ్మెల్యే గారి మార్గదర్శకం ఎంతో ఉపయోగపడిందని పేర్కొన్నారు. సంఘం ఆర్థిక పరంగా కూడా బలంగా ఉందని, ఆదాయం మరియు రికవరీ విషయంలో జిల్లా స్థాయిలో ముందంజలో ఉన్నామని తెలిపారు. రైతులకు రుణాలు సకాలంలో అందించడంలో సంఘం కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. రైతుల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం మా ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. అదేవిధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి రైతులకు మార్కెట్ సమస్యలు లేకుండా నేరుగా కొనుగోలు చేసే విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన రూ. 20 వేల 360 రూ,, మద్దతు ధరను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ నాయకత్వం వలన గూడూరు ప్రాంతంలో రైతు సంక్షేమం మరింత బలోపేతం అయిందని, ఆయన సహకారం లేకపోతే ఈ స్థాయిలో అభివృద్ధి సాధ్యపడేది కాదని కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. రైతు సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ పరిష్కారం చూపే నాయకుడిగా ఎమ్మెల్యే గారు నిలుస్తున్నారని కొనియాడారు. ముందు ముందు కూడా రైతులకు ఎలాంటి సమస్యలు వచ్చినా సహకార సంఘం మరియు సహకార బ్యాంక్ ద్వారా అన్ని విధాల సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రైతులు ఎటువంటి సందేహాలు లేకుండా సంఘాన్ని సంప్రదించాలని కోరారు.ఈ సందర్భంగా సీఈఓ నారాయణ మాట్లాడుతూ సంఘం ప్రగతిని వివరించారు. ప్రస్తుతం సంఘం 25 సంవత్సరాలుగా విజయవంతంగా కొనసాగుతూ మొత్తం 2,228 మంది సభ్యులతో సేవలందిస్తున్నట్లు తెలిపారు. సంఘం ఔట్స్టాండింగ్ మొత్తం సుమారు రూ. 28 కోట్ల 36 లక్షల 41 వేలుగా ఉందని, సంఘం ఆదాయం సుమారు రూ. 80 లక్షల 99 వేలుగా నమోదైందని చెప్పారు. సంఘం తరుపున ఇప్పటి వరకు 320 మెట్రిక్ టన్ను యూరియా రైతులు కు అందించడం జరిగిందని సీఈఓ తెల్పారు.ఈ కార్యక్రమంలో బచ్చల రవీంద్ర రెడ్డి డైరెక్టర్, దువ్వూరు రవీంద్ర రెడ్డి డైరెక్టర్, వెంకటేశ్వర్లు రాజు టిడిపి మండల అధ్యక్షుడు, దుద్దా రాఘవరెడ్డి రైతు సంఘం అధ్యక్షులు , టిడిపి నాయకులు బత్తల శ్రీనివాసరెడ్డి, సీఈఓ నారాయణతో పాటు సంఘ సిబ్బంది , రైతులు పాల్గొన్నారు.













