PMAY 2.O పథకం కింద నిర్మించిన ఇల్లు ప్రారంభించిన టీడీపీ నేతలు

తెలుగు దేశం పార్టీ హామీ ఇచ్చిన పేదవానికి సొంత ఇంటి కల నెరవేర్చే కార్యక్రమం నకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే పాశిo సునీల్ కుమార్*

      రాష్ట్ర వ్యాప్తంగా నేడు టిడ్కో ఇళ్ళు పేద లబ్ధిదారులకు అందించే కార్యక్రమం లో భాగం గా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట లో ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమం లో భాగంగా ఎమ్మెల్యే పాశిo సునీల్ కుమార్ ఆదేశాలతో ఆయన ముఖ్య మంత్రి గారి పర్యటనలో ఉన్నందున నేడు గృహ నిర్మాణ శాఖ డి. ఇ. గారిని స్థానిక నాయకుల తో కలిసి గూడూరు లో పి. ఎం. ఎ. వై. 2.0 కింద పూర్తి అయిన ఇళ్లకు ప్రారoభోత్సవం కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించడం తో  గూడూరు 2వ పట్టణం 25 వ వార్డు ఇందిరానగర్ నందు సుజాతమ్మ గారి ఇంటిని వారి కుటుంబ సభ్యులు, స్థానిక నాయకుల తో కలసి గృహ నిర్మాణ శాఖ అధికారులు గృహప్రవేశం చేయడం జరిగింది.

        ఈ సందర్భం గా మాజీ కౌన్సిలర్స్ బిల్లు చెంచురామయ్య, తాతపూడి ఇశ్రాయేల్ కుమార్, టీడీపీ జిల్లా అధికార ప్రతినిది ఎండీ. అబ్దుల్ రహీం లు పాల్గొని మాట్లాడుతూ, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పేద వారి సొంత ఇంటి కల నెరవేర్చందుకు శ్రీకారం చుట్టిన ముఖమంత్రి గారికి, లోకేష్ బాబు గారికి, ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు తెలియచేస్తున్నామని, గూడూరు పట్టణం లో స్వంతగా స్థలం గల 660 మందికి గృహాలు మంజూరు అయ్యాయని, 311 మంది ఇంకా ప్రారంభించలేదని, కావున ప్రతి ఒక్కరు ఈ పథకాన్ని ఉపయోగించుకొని లబ్ది పొందాలన్నారు.
*రెవిన్యూ సిబ్బంది గృహాలు మంజూరైన పీదలను ఇబ్బంది పెట్టకుండా పొజిషన్ సర్టిఫికెట్ లు ఇవ్వాలి*

ఈ సందర్భం గా మాజీ కౌన్సిలర్ ఇశ్రాయేల్ కుమార్ మాట్లాడుతూ పి. ఎం. ఎ. వై. 2.O కింద గృహాలు మంజూరు అయిన లబ్ది దారులకు రెవిన్యూ సిబ్బంది పొజిషన్ సర్టిఫికెట్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, పేదలు వారి రోజు కూలీ వదులుకొని రోజులతరబడి రెవిన్యూ సిబ్బంది చుట్టూ తిరగ వలసి వస్తుందని, ఈ సమస్య ను ఎమ్మెల్యే గారి దృష్టికి మరియు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళతామని, హోసింగ్ అధికారులు కూడా మీకు శాఖపరమైన సమీక్షలు జరిగినపుడు ఈ సమస్యను, మంత్రిగారికి, ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారి దృష్టి కి తీసుకెళ్ళాలన్నారు.

     ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్, సీనియర్ మాజీ కౌన్సిలర్ బిల్లు చెంచురామయ్య, మాజీ కౌన్సిలర్, టీడీపీ తిరుపతి పార్లమెంట్ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు టి.ఇశ్రాయేల్ కుమార్, టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి ఎండీ. అబ్దుల్ రహీం, హోసింగ్ డి. ఇ. షేక్ షబ్బీర్, వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, గృహ యజమానులు సుజాతమ్మ, కృష్ణ, స్థానిక టీడీపీ నాయకులు చక్రవర్తి, చంద్ర, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam