
గూడూరు పట్టణానికి చెందిన ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న నాయకుడిగా గుర్తింపు పొందారు. స్టూడెంట్ లీడర్‌గా ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రస్థానం నేడు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవివరకు ఎదగడం విశేషంగా నిలిచింది. వాగ్ధాటి, దూకుడు రాజకీయ శైలితో “ఫైర్ బ్రాండ్” నాయకుడిగా పేరు తెచ్చుకున్న సునీల్ కుమార్ ప్రజా సమస్యలపై ఎప్పుడూ ముందుండే నేతగా గుర్తింపు పొందారు. ప్రత్యర్థులపై ముక్కుసూటిగా విమర్శలు చేస్తూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ తన ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. 1969 జూలై 3న ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో జన్మించిన సునీల్ కుమార్ తల్లిదండ్రులు దివంగత పెంచలయ్య, సరోజనమ్మ దంపతులు. ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి వరకు చదివిన ఆయన ఎస్.కె.ఆర్ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచే నాయకత్వ లక్షణాలు కలిగిన ఆయన స్టూడెంట్ లీడర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. 1995లో రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన సునీల్ కుమార్ అదే సంవత్సరంలో సంధ్యారాణిని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నారు. 1995 నుండి 2000 వరకు గూడూరు మున్సిపల్ చైర్మన్‌గా సేవలందించారు. 1997లో అన్న ఎన్టీఆర్ పార్టీ తరఫున తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. 2001లో వెలుగు ప్రాజెక్టులో సీసీగా పనిచేసి ప్రజలకు మరింత చేరువయ్యారు. 2013లో వైసీపీ పార్టీలో చేరిన ఆయన 2014లో వైసీపీ తరఫున గూడూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 2016లో తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గూడూరు నియోజకవర్గ అభివృద్ధికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి అభివృద్ధి ప్రధాతగా నిలిచారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయినా ఐదేళ్లపాటు ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల సమస్యలపై పోరాటం కొనసాగించారు. 2024 ఎన్నికల్లో మళ్లీ గూడూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ చేపట్టిన అనేక ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్న సునీల్ కుమార్ యువగళం పాదయాత్రలో కీలక పాత్ర పోషించారు. పార్టీకి విధేయతతో పని చేసిన ఆయనకు గుర్తింపుగా 2026లో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించబడడం ఆయన రాజకీయ జీవితంలో మరో మైలురాయిగా నిలిచింది. నమ్మిన వారిని గుర్తించి కష్ట సమయాల్లో అండగా నిలిచిన వారికి ఉన్నత పదవులు అందించడం సునీల్ కుమార్ నైజంగా ప్రజల్లో విశ్వాసాన్ని పెంచింది. అందుకే ఆయనను అనుచరులు ప్రేమతో “మన సునీల్ – మన గూడూరు” అని పిలుచుకుంటున్నారు. ప్రస్తుతం గూడూరు రాజకీయాల్లో ఒక బలమైన శక్తిగా కొనసాగుతున్న పాశిం సునీల్ కుమార్ తన దూకుడు రాజకీయ శైలి, ప్రజలతో ఉన్న అనుబంధంతో యువతలో ఆదరణ పొందుతున్న నాయకుడిగా నిలిచారు.*












