
AP: పశ్చిమ గోదావరి (D) ఆకివీడులో గత కొంతకాలంగా రామాలయ నిర్మాణం విషయంలో నెలకొన్న ఉద్రిక్తతలకు సుప్రీంకోర్టు(SC) తాత్కాలికంగా ఫుల్స్టాప్ పెట్టింది. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆలయ ప్రాంగణంలో భవనాల కూల్చివేత అయినా లేదా కొత్త నిర్మాణాల ప్రారంభమైనా, ఖచ్చితంగా ప్రభుత్వ ముందస్తు అనుమతులు ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది. అనుమతులు లేకుండా అడుగు ముందుకు వేసినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కోర్టు హెచ్చరికలు జారీ చేసింది.












