“కౌన్ బానేగా ఛాంపియన్” విజేతలకు బహుమతులు — విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు సాధించాలి: ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్

గూడూరు పట్టణం:
గూడూరు పట్టణంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థుల్లో పోటీ భావనను పెంపొందిస్తూ, వారి ప్రతిభను వెలికితీయడానికి నిర్వహించిన “కౌన్ బానేగా ఛాంపియన్” కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో విజేతలైన విద్యార్థులకు చవటపాలెం ZPHS పాఠశాల ఆవరణలో ప్రత్యేకంగా బహుమతుల ప్రదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ హాజరై పోటీలలో ప్రతిభ కనబరిచి విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ వారికి ప్రోత్సాహకరంగా మాటలందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, విద్యార్థులు చిన్న వయస్సు నుంచే లక్ష్యాలను నిర్ణయించుకుని కష్టపడి చదివితే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని తెలిపారు. పోటీలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు, జ్ఞానాన్ని విస్తరించేందుకు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుతూ ఉన్నత విద్యను అభ్యసించి తమ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మరియు సమాజానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
అలాగే విద్యార్థుల అభివృద్ధి కోసం ప్రభుత్వం విద్యా రంగానికి ప్రాధాన్యత ఇస్తోందని, పాఠశాలల్లో మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు కృషి జరుగుతోందని తెలిపారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా వారు భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఎదుగుతారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, తల్లిదండ్రులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విజేతలైన విద్యార్థులు బహుమతులు అందుకోవడంతో ఆనందం వ్యక్తం చేశారు.

error: Content is protected !!
Prajaveek Shanam