ట్రాఫిక్ నియంత్రణలో వన్ టౌన్ సీఐ శేఖర్ బాబు చర్యలు

కర్తవ్య నిర్వహణలో అనుదినం చర్యలు – రద్దీ ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ

గూడూరు పట్టణం :- గూడూరు పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శేఖర్ బాబు అనుదినం ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. కర్తవ్య నిర్వహణలో భాగంగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో స్వయంగా పర్యవేక్షణ నిర్వహిస్తూ ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు.
పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వంటి అత్యంత రద్దీ ప్రాంతాల్లో సీఐ శేఖర్ బాబు ప్రతిరోజూ తన సిబ్బందితో కలిసి ట్రాఫిక్ పరిస్థితిని పరిశీలిస్తున్నారు. రద్దీ సమయాల్లో వాహనాల రాకపోకలను సక్రమంగా నిర్వహిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు మరియు టు వీలర్ వాహనదారులకు సీఐ శేఖర్ బాబు పలు ముఖ్య సూచనలు చేశారు. పట్టణంలో ట్రాఫిక్ రద్దీకి ప్రధాన కారణంగా మారుతున్న అనియంత్రిత పార్కింగ్‌ను నివారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ముఖ్యంగా టవర్ క్లాక్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో ఆటోలు రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ నిలిపివేయకుండా, మున్సిపాలిటీ నిర్ణయించిన పార్కింగ్ ప్రదేశాల్లో మాత్రమే నిలిపివేయాలని సూచించారు.అలాగే టు వీలర్ వాహనదారులు కూడా ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని, రోడ్లపై వాహనాలు అడ్డంగా నిలిపితే ఇతర వాహనదారులు మరియు ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతుందని హెచ్చరించారు. రద్దీ ప్రాంతాల్లో నియమాలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.వన్ టౌన్ సీఐ శేఖర్ బాబు చేపడుతున్న ట్రాఫిక్ నియంత్రణ చర్యలతో గూడూరు పట్టణంలో రద్దీ కొంత మేర తగ్గి, వాహనాల రాకపోకలు సాఫీగా కొనసాగుతున్నాయని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam