
నెల్లూరు జిల్లా గూడూరు పట్టణం :- ఇటీవల పత్రికలలో SKR ప్రభుత్వ కళాశాలపై వస్తున్న వార్తల నేపథ్యంలో, కళాశాల ప్రిన్సిపాల్ మరియు విద్యార్థులతో క్యాంప్ కార్యాలయంలో సమావేశం నిర్వహించి సమస్యలను సమన్వయం చేసినట్లు డాక్టర్ శ్రీ పాశిం సునీల్ కుమార్ గారు, శాసన సభ్యులు మరియు రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, SKR కళాశాలకు గొప్ప చరిత్ర ఉందని, అక్కడ చదువుకున్న ఎంతో మంది విద్యార్థులు దేశ విదేశాల్లో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారని అన్నారు. తాను కూడా ఈ కళాశాలలో ఛైర్మన్‌గా పనిచేసిన అనుభవం ఉందని, ఇప్పటికీ కళాశాల అభివృద్ధికి కృషి చేస్తున్నానని పేర్కొన్నారు.ఇటీవల పత్రికలలో వచ్చిన వార్తలు కొంత ఇబ్బందికరంగా అనిపించడంతో ప్రిన్సిపాల్ మరియు విద్యార్థులను పిలిపించి మాట్లాడినట్లు తెలిపారు. చిన్న చిన్న సమస్యల కారణంగా ఈ విషయాలు పత్రికలలో ప్రచురితమైనట్లు ఆయన అభిప్రాయపడ్డారు.చదువుకుంటున్న విద్యార్థులను ఫీజులు చెల్లించలేదని ఇబ్బంది పెట్టకూడదని ప్రిన్సిపాల్‌కు సూచించారు. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ పొందిన విద్యార్థులు తక్షణమే కళాశాలకు తమ ఫీజులను చెల్లించాలని సూచించారు.రీయింబర్స్మెంట్ ఇంకా రాని విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టకూడదని ప్రిన్సిపాల్‌కు ఆదేశించగా, ప్రభుత్వం నుంచి రీయింబర్స్మెంట్ విడుదలైన వెంటనే విద్యార్థులు తమ ఫీజులను కళాశాలకు చెల్లించాలని విద్యార్థులకు తెలిపారు.త్వరలో కళాశాల సిబ్బంది మరియు విద్యార్థులతో మరో సమావేశం ఏర్పాటు చేసి, కళాశాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తానని ఆయన వెల్లడించారు.












