
నెల్లూరు జిల్లా గూడూరు పట్టణం: MV నగర్లోని ST బాలికల పాఠశాలలో ఇటీవల చోటుచేసుకున్న ఘటన నేపథ్యంలో అక్కడి ఉపాధ్యాయులు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛంతో అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఇటీవల జరిగిన సమస్యపై సిబ్బందితో క్యాంప్ కార్యాలయంలో సమావేశం నిర్వహించినట్లు ఆయన తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, MV నగర్లోని ST బాలికల పాఠశాలలోకి ఆగంతకుడు ప్రవేశించడం చాలా విచారకరమని అన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ఇప్పటికే పోలీసులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.అక్కడ జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. పాఠశాలలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే పై అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
బాలికల పాఠశాల కావున అక్కడ పనిచేస్తున్న సిబ్బంది మరింత అప్రమత్తంగా, చురుకుగా విధులు నిర్వహించాలని సూచించారు.
ఇటీవల కూటమి ప్రభుత్వం ప్రకటించిన DSC ద్వారా ఎంపికై పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నామని, కూటమి ప్రభుత్వానికి మరియు మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఉపాధ్యాయులు తెలిపినందుకు సంతోషంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.












