
నెల్లూరు జిల్లా గూడూరు కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన బార్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. ఈ ఎన్నికల్లో అసోసియేషన్ అధ్యక్షుడిగా పి.వి. సాయికుమార్ రెడ్డి ఘన విజయం సాధించారు. గురువారం జరిగిన ఎన్నికల ప్రక్రియలో న్యాయవాదులు ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించారు.నూతన కార్యవర్గంలో ఉపాధ్యక్షుడిగా షేక్ నాగుర్, ప్రధాన కార్యదర్శి (జనరల్ సెక్రటరీ)గా ఎం.వి. కృష్ణయ్య, జాయింట్ సెక్రటరీగా పి. ప్రతాప్ కుమార్, కోశాధికారి (ట్రెజరర్)గా షేక్ వహీదా, లైబ్రరీ సెక్రటరీగా షేక్ రషీద్, క్రీడా–సాంస్కృతిక విభాగ ప్రతినిధిగా ఎస్. దయాకర్ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా మనోజ్, మధు, వెంకటేష్, భాగ్యలక్ష్మి, రేవతి తదితరులు ఎన్నికైనట్లు ఎన్నికల నిర్వాహకులు వెల్లడించారు.ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే నూతనంగా ఎన్నికైన ప్రతినిధులకు తోటి న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికైన సభ్యులు మాట్లాడుతూ న్యాయవాదుల సంక్షేమం, బార్ అసోసియేషన్ అభివృద్ధి కోసం సమిష్టిగా కృషి చేస్తామని తెలిపారు.













