అనారోగ్య బాధితులకు అండగా నిలుస్తున్న ఎమ్మెల్యే

  • ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఇద్దరు బాధితులకు ఆర్థిక సహాయం
  • సహాయం కోరగానే వెంటనే స్పందించి నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్

గ్రామంలో ఎవరికైనా అనారోగ్యం కలిగితే అండగా నిలిచే నాయకుడిగా మారుబోయన దామోదర్‌కు గ్రామస్తుల ప్రశంసలు

గూడూరు, ఏప్రిల్ 25

నెల్లూరు జిల్లా గూడూరు అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందిన బాధితులకు ఆర్థికంగా అండగా నిలుస్తూ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ అందజేశారువెడిచర్ల గ్రామానికి చెందిన జడ్డా జయమ్మ, సోలోమీ అనే ఇద్దరు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సాయం మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.వెడిచర్ల గ్రామానికి చెందిన బాధితులు అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న టీడీపీ నాయకుడు మారుబోయన దామోదర్ ఈ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా, వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వారికి నిధులు మంజూరు అయ్యేలా చర్యలు చేపట్టారు. అనంతరం ఆర్థిక సహాయాన్ని బాధితులకు స్వయంగా అందజేశారు.ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ, అనారోగ్యంతో బాధపడుతూ ఎంతో ఖర్చుతో కూడినచికిత్సచేయించుకోవాల్సి వచ్చిన సమయంలో ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్‌ను సహాయం కోరగా, వెంటనే స్పందించి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందజేశారని తెలిపారు. తమకు అందించిన సహాయాన్ని జీవితాంతం మరచిపోలేమని, ఎమ్మెల్యే సునీల్ కుమార్‌తో పాటు మారుబోయన దామోదర్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.మారుబోయన దామోదర్ గ్రామంలో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వెంటనే స్పందించి సహాయం చేసే వ్యక్తిగా గ్రామవాసులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఆయన ముందుండి సేవలు అందిస్తున్నారని కొనియాడారు.

error: Content is protected !!
Prajaveek Shanam