
ఈ నెల 28న డీఆర్డబ్ల్యూ కళాశాలలో జాబ్ మేళా — 15 కంపెనీలతో 1000 మందికి పైగా ఉపాధి అవకాశాలు
గూడూరు, ఏప్రిల్ 25:
నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత జాబ్ మేళాను సద్వినియోగం చేసుకుని ఉపాధి అవకాశాలను పొందాలని గూడూరు శాసన సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాశిం సునీల్ కుమార్ పిలుపునిచ్చారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఈ నెల 28-04-2026 తేదీన గూడూరులోని డీఆర్డబ్ల్యూ కళాశాల నందు ఉదయం 9.00 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ జాబ్ మేళాలో దాదాపు 15 కంపెనీలు పాల్గొని 1000 మందికి పైగా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. కావున నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగ యువత ఈ జాబ్ మేళా కార్యక్రమంలో తప్పక పాల్గొని అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ కోరారు.












