2026పై బాబా వంగా జోస్యం.. ప్రపంచాన్ని కలవరపెడుతున్న అంచనాలు

బల్గేరియాకు చెందిన ప్రసిద్ధ అంధురాలు, భవిష్యవాణులు చెప్పడంలో ప్రఖ్యాతిగాంచిన బాబా వంగా చేసిన జోస్యాలు ప్రపంచవ్యాప్తంగా ఎప్పటికప్పుడు చర్చనీయాంశమవుతూనే ఉన్నాయి. గతంలో ఆమె పేర్కొన్న కొన్ని సంఘటనలు నిజమయ్యాయని విశ్వసించే వారు ఉండటంతో, ఆమె చెప్పే అంచనాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది.
ఇప్పుడు 2026 సంవత్సరానికి సంబంధించిన ఆమె జోస్యం మరోసారి ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ప్రకృతి ప్రకోపాలు తీవ్రమవుతాయని ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
బాబా వంగా అంచనాల ప్రకారం 2026లో ఎండలు గతంలో ఎన్నడూ లేనంత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. వడగాల్పులు, ఉక్కపోత ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టే స్థాయికి చేరుకుంటాయని పేర్కొన్నట్లు సమాచారం. సూర్యుని తీవ్రత కారణంగా సాధారణ జీవనం కూడా కష్టమవుతుందని, ఎంతలా అంటే ఇంట్లో ఉపయోగించే ఏసీలు, కూలర్లు కూడా సరైన ఉపశమనం ఇవ్వలేని పరిస్థితులు నెలకొనే అవకాశముందని ఆమె జోస్యంలో పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇంకా తీవ్రమైన దాహం, గొంతు ఎండిపోవడం, నీడలో ఉన్నా కూడా వేడి సెగలు తగిలే పరిస్థితులు ఏర్పడి, ప్రజలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉందని హెచ్చరించినట్లు చెబుతున్నారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారత్‌లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే ఈ అంచనాలు నిజమవుతాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే శాస్త్రీయంగా ఇవి నిర్ధారించబడిన జోస్యాలు కావని, వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ వంటి కారణాల వల్లే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.మొత్తంగా, బాబా వంగా జోస్యం మరోసారి చర్చకు దారి తీస్తుండగా, వాస్తవ పరిస్థితులపై శాస్త్రీయ అవగాహనతో పాటు జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam