
ఆంధ్రప్రదేశ్ న్యాయ చరిత్రలో కీలక ఘట్టంగా నిలిచే పరిణామంగా, జస్టిస్ లీసా గిల్ నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారుఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ పదవీ విరమణ చేయడంతో, ఆయన స్థానంలో జస్టిస్ లీసా గిల్ నియమితులయ్యారు.జస్టిస్ లీసా గిల్ గతంలో పంజాబ్ & హర్యానా హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలందించారు. సుప్రీంకోర్టు కొలీజియం అమలు చేస్తున్న కొత్త విధానం ప్రకారం, ఆమెను మార్చి నెలలోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేశారు. బాధ్యతలు స్వీకరించే ముందు సంబంధిత కోర్టు పరిపాలనపై అవగాహన పెంపొందించుకోవడమే ఈ విధానం లక్ష్యం.
ఈ నియామకంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు తొలి మహిళా చీఫ్ జస్టిస్‌గా జస్టిస్ లీసా గిల్ చరిత్ర సృష్టించారు. ఆమె బాధ్యతల స్వీకారం న్యాయవ్యవస్థలో మహిళల ప్రాధాన్యతను మరింత బలపరుస్తుందని న్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.












