నాయుడుపేటలో ప్రతి సోమవారం ‘ప్రజా విన్నపాల దినం’ ప్రారంభం

నాయుడుపేట మండల ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రతి సోమవారం ‘ప్రజా విన్నపాల దినం’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తహశీల్దార్ యువరాజు తెలిపారు. ఈ కార్యక్రమం మే 4వ తేదీ నుండి అమల్లోకి రానుంది.
ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) కార్యాలయంలో వినతుల స్వీకరణ జరుగుతుంది. మండల స్థాయి వివిధ శాఖల అధికారులు ఒకే చోట అందుబాటులో ఉండి ప్రజల అర్జీలను నేరుగా స్వీకరిస్తారు.అధికారుల హాజరు తప్పనిసరి
ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని తహశీల్దార్ ఆదేశించారు. దీనివల్ల ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించే అవకాశముంటుందని ఆయన పేర్కొన్నారు.
మండలంలోని ప్రజలు తమ సమస్యలు, విన్నపాలను ప్రతి సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో సమర్పించుకోవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహశీల్దార్ యువరాజు విజ్ఞప్తి చేశారు.

error: Content is protected !!
Prajaveek Shanam