
కాలవ శుద్ధి పనులతో రైతులకు ఊరటనిచ్చిన ఎమ్మెల్యే – గుండాల లీలావతి ప్రశంసలు
గూడూరు, మే 3:
గూడూరు నియోజకవర్గంలోని చిల్లకూరు మండలం ఓడూరు పంచాయతీ పరిధిలో తెలుగు గంగా కాలవ పూడిక తొలగింపు, జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. గౌరవ శాసనసభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాశం సునీల్ కుమార్ గారి ఆదేశాలతో ఈ పనులు వేగంగా ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ స్టేట్ డైరెక్టర్ గుండాల లీలావతి. ఆధ్వర్యంలో పనులు కొనసాగుతున్నాయి గత ఏడు సంవత్సరాలుగా కాలవ పూడిక కారణంగా చెరువులకు నీరు అందక ఇబ్బందులు పడుతున్న ఓడూరు, తీపనూరు, రెట్టపల్లి గ్రామాల రైతులు ఈ పనుల ప్రారంభంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సమస్యను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లగానే వెంటనే స్పందించి అధికారులతో చర్చించి పనులు ప్రారంభించడాన్ని రైతులు అభినందిస్తున్నారు.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ స్టేట్ డైరెక్టర్ గుండాల లీలావతి మాట్లాడుతూ…“గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ గారు ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, వెంటనే చర్యలు తీసుకునే నాయకుడు. రైతుల ఇబ్బందులను తనవిగా భావించి పరిష్కారం చూపడం ఆయన ప్రత్యేకత. కాలవ పూడిక తొలగింపు పనులను త్వరితగతిన ప్రారంభించడం ద్వారా సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారు.
ఆయన నాయకత్వంలో గూడూరు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రైతుల అభ్యున్నతే లక్ష్యంగా తీసుకుని ఇలాంటి పనులను ముందుకు తీసుకెళ్తుండటం అభినందనీయం. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేయాలని ఆశిస్తున్నాము” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో చిల్లకూరు మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు చిట్టేటి కీరవాణి, నాయకులు గుండాల శ్రీనివాసులు, స్థానిక నాయకులు మరియు రైతులు పాల్గొన్నారు.













