ప్రభుత్వ విద్యకు కొత్త దిశ చూపుతున్న మంత్రి నారా లోకేష్ _ ఎమ్మెల్యే సునీల్ కుమార్

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఘన సన్మానం_ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్

గూడూరు పట్టణం:- నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో SSC పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులను గూడూరులోని DRW కళాశాలలో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గూడూరు ఎమ్మెల్యే మరియు రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్  పాశిం సునీల్ కుమార్ విద్యార్థులకు జ్ఞాపికలు అందజేసి అభినందనలు తెలిపారు.
పాశిం సునీల్ కుమార్ మాట్లాడుతూ విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులు ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలనుమార్చుతున్నాయనిపేర్కొన్నారు.ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోకుండా ప్రతిభ కనబరుస్తున్నారని అన్నారు. గతంలో పత్రికల్లో ఎక్కువగా ప్రైవేట్ పాఠశాలల ఫలితాలకే ప్రాధాన్యత ఉండేదని, కానీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి  నారా లోకేష్  తీసుకొచ్చిన సంస్కరణల వల్ల ఇప్పుడు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభ కూడా రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందుతోందన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి, డిజిటల్ విద్య, ఇంగ్లీష్ మీడియం బోధన, ఆధునిక తరగతి గదులు, స్మార్ట్ లెర్నింగ్ విధానాలు, విద్యార్థుల ప్రతిభకు ప్రోత్సాహక బహుమతులు వంటి అనేక కార్యక్రమాలను మంత్రి లోకేష్ అమలు చేస్తున్నారని తెలిపారు. విద్యార్థుల్లో పోటీ తత్వం పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు.
SSCలో 570కు పైగా మార్కులు సాధించిన 11 మంది విద్యార్థులకు ట్యాబ్‌లు, ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్ ఫస్ట్‌గా నిలిచిన 34 మంది విద్యార్థులకు వాచ్‌లు ను ఎమ్మెల్యే అందజేశారు  విద్యార్థులు
భవిష్యత్తులో ఉన్నత చదువులు అభ్యసించి తల్లిదండ్రులకు, పాఠశాలలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో  ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యాశాఖ అధికారులు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam