
గూడూరు పట్టణం, బేల్దార్ కాలనీ:
బేల్దార్ కాలనీ ప్రజలు తమ ప్రాంతంలో సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలని కోరుతూ శాసన సభ్యులు మరియు రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాశిం సునీల్ కుమార్ గారికి అర్జీలు సమర్పించారు. కాలనీలో రోడ్ల సమస్యల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుంటామని తెలిపారు. బేల్దార్ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణంపై త్వరలో సంబంధిత అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకుని ఏర్పాటు చేయించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాలనీ ప్రజలు, పార్టీ నాయకులు మరియు స్థానికులు పాల్గొన్నారు.













