
గూడూరు మే 16: ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో గూడూరు ఆర్టీసీ డిపో వద్ద గేట్ మీటింగ్, ధర్నా కార్యక్రమం జరిగింది.గూడూరు డిపో అధ్యక్షులు వై వి నారాయణ, ఎస్కె . జిలాని భాష ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమం లో ఎలక్ట్రీకల్ బస్సు లను ప్రవేశ పెట్టి ఆర్టీసీ డిపోలను ప్రవేట్ వారికి అప్పగించే విధానాన్ని మానుకోవాలి అని, అలాగే ఎలక్ట్రిల్ బస్సు లను కూడా ఆర్టీసీ సిబ్బంది ద్వారానే నడపాలని, ఉద్యోగుల డి ఏ , పి ఆర్ సి బకాయిలు చెల్లించాలని, 2023 నుండి రావాల్సిన పి ఆర్ సి ఆలస్యం అవుతున్నందున వెంటనే ఐ ఆర్ ప్రకటించి, పి ఆర్ సి కమీషనర్ నియమించాలని, ప్రభుత్వం మే కొత్త బస్సు లను కొనుగోలు చేసి ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యంలు కలిపించాలని, అన్ని విభాగాలలో కాళీలు భర్తీ చేసుకొనుటకు ఉద్యోగ నియామకాలు చేపట్టాలని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పి . సుబ్రహ్మణ్యం రాజు, డిపో అధ్యక్షులు వై. వి.నారాయణ మాట్లాడినారు. ఈ ధర్నా కార్యక్రమం లో అధికసంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.












