పెంచిన పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలు తగ్గించాలి…సి.పి.యం డిమాండ్…


గూడూరు  మే 16: కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్,గ్యాస్, ధరలు తగ్గించాలని, జిల్లా కమిటి ఇచ్చిన పిలుపు మేరకు శనివారం రోజు సి.పి.యం సి.ఐ.టి.యు ప్రజా సంఘాల నాయకులు,ఆటో కార్మికుల, ఆధ్వర్యంలో గూడూరు పాత బస్టాండ్ వద్ద ఆటోలను మోకులతో లాగుతూ నిరసన ప్రదర్శన చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కేరళ,తమిళనాడు,బెంగాల్ రాష్ట్రాలలో ఎన్నికలు అయిన వెంటనే పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలు పెంచారని ఇప్పటికే అనేకసార్లు పెట్రోల్,డీజిల్,గ్యాస్ పెరిగిన ధరలు కారణంగా మొత్తం రావాణా రంగం సంక్షోభం లో కొట్టుమిట్టాడుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా లీటర్ డీజిల్ పై 3 రూపాయలు పెంచడం వలన రావాణా రంగం డ్రైవర్ల ఉపాధి,రైతులు,చిరు వ్యాపారాలు పై తీవ్ర ప్రభావం పడడంతో పాటు ప్రజల పైన మరింత భారం పడి* అన్ని రకాల నిత్యవసర సరుకులు ధాన్యం,పప్పులు,ఉప్పులు రావాణా చార్జీలు పెరగడం ప్రజలపై విపరీతమైన భారాలు పడతాయని అన్నారు. పెంచిన పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో గూడూరు సి.పి.యం శాఖ కార్యదర్శి జోగి.శివకుమార్,సి.ఐ.టి.యు ప్రధాన కార్యదర్శి బి.వి.రమణయ్య,భవన నిర్మాణ సంఘ నాయకులు పుట్టా శంకరయ్య,గండికోట మధు, కె.వి.పి.యస్ అధ్యక్ష, కార్యదర్శులు అడపాల ప్రసాద్, ఏంబేటిచంద్రయ్య,నరసింహులు,సంతానం,ఆటో సంఘ నాయకులు భాస్కర్ రెడ్డి,డేవిడ్,మురళి,తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam