ప్రజా విజ్ఞప్తుల దినంలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం

ప్రజా విజ్ఞప్తుల దినంలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం

భూదనం గ్రామంలో ఎస్సీ, ఎస్టీల స్మశాన భూములు, బేత పురంబోకు ఆక్రమణలపై ఫిర్యాదు

జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులు యేసుపాకు పెంచలయ్య, గూడూరు డివిజన్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులు రావూరు సురేంద్ర సోమవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా విజ్ఞప్తుల దినంలో జిల్లా కలెక్టర్‌ను కలిసి పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా చిల్లకూరు మండలం భూదనం గ్రామంలో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన స్మశాన వాటిక భూముల ఆక్రమణపై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే నేషనల్ హైవే పక్కన ఉన్న సీలింగ్ భూములను కొంతమంది ఇతరులు ఆక్రమించి కంపెనీల కోసం వినియోగిస్తున్నారని ఫిర్యాదు చేశారు.
భూదనం గ్రామంలో సుమారు 400 ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాలు నివసిస్తున్నాయని, వీరిలో ఎక్కువ మంది పాడి పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని తెలిపారు. గ్రామానికి సమీపంలో ఉన్న సర్వే నంబర్ 256లో పశువుల మేత కోసం కేటాయించిన బేత పురంబోకు భూమిని కొంతమంది ఆక్రమించి కంపెనీలు స్థాపించారని ఆరోపించారు. ఈ భూములను తిరిగి గ్రామ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డివిఎంసి సభ్యులు జిల్లా కలెక్టర్‌ను కోరారు.
అదేవిధంగా విందూరు గ్రామంలో కొనసాగుతున్న భూ సమస్యలపై కూడా కలెక్టర్‌కు వివరించారు. సమస్యలను విన్న జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో విచారణ జరిపించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో యూనిటీ ఇన్‌చార్జి రమేష్ రెడ్డి, బూత్ కన్వీనర్ శ్యామ్ బాబు తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam