మంగళగిరిలో టీడీపీ యూనిట్ ఇంచార్జ్‌ల శిక్షణ కార్యక్రమం


గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ సూచన మేరకు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర పార్టీ కార్యాలయంలో ఈ నెల 22, 23 తేదీలలో నిర్వహిస్తున్న యూనిట్ ఇంచార్జ్‌ల శిక్షణ కార్యక్రమానికి గూడూరు పట్టణం నుంచి పలువురు హాజరయ్యారు.ఈ కార్యక్రమానికి ఎండీ అబ్దుల్ రహీమ్, తాతపూడి ఇశ్రాయేల్ కుమార్, ఎస్‌కే అల్లీ హుస్సేన్, ఆర్‌ఎస్‌కే సద్దాం తదితరులు పాల్గొన్నారు. పార్టీ బలోపేతం, కార్యాచరణ, ప్రజల్లో పార్టీ సిద్ధాంతాల ప్రచారం వంటి అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.

error: Content is protected !!
Prajaveek Shanam