
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహానాడు వేడుకలను పసుపు పండుగగా నిర్వహిస్తూ, పార్టీ కోసం సేవలందించిన స్వర్గీయ నాయకులు, కార్యకర్తలకు ఘన నివాళులు అర్పించడం ఆనవాయితీగా కొనసాగుతోందని జి.కె.వీధి మండల టీఎన్ఎస్ఎఫ్ కార్యదర్శి ముక్కలి ఐశ్వర్య తెలిపారు.ఈ మేరకు ఆమె విడుదల చేసిన ప్రకటనలో మాట్లాడుతూ, ఈ ఏడాది మహానాడు సందర్భంగా మండలంలోని స్వర్గీయ టీడీపీ నాయకులు, కార్యకర్తల జ్ఞాపకార్థం మండల టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పార్టీ అధిష్టానం నిర్ణయించిన క్లస్టర్ విధానం ప్రకారం ఈసారి మండల స్థాయిలోనే మహానాడు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
అదేవిధంగా జి.కె.వీధి మండల పరిధిలోని 16 పంచాయతీల్లో పర్యటిస్తూ, ఇటీవల మరణించిన టీడీపీ నాయకులు, కార్యకర్తల జ్ఞాపకార్థం వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టి వారికి ఘన నివాళులు అర్పించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఇటీవల మరణించిన 16 పంచాయతీలకు చెందిన టీడీపీ కార్యకర్తల వివరాలను సేకరించి పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. అలాగే ఈ నెల 27, 28 తేదీలలో నిర్వహించే మహానాడు కార్యక్రమంలో కూడా వారికి ప్రత్యేకంగా నివాళులు అర్పించేలా మండల కమిటీ తగిన చర్యలు చేపట్టాలని ముక్కలి ఐశ్వర్య కోరారు.












