
తిరుపతి: ఈ రోజు తిరుపతి నగరంలోని ఎన్‌టీఆర్ సర్కిల్ వద్ద తిరుపతి మాజీ ఎమ్మెల్యే మరియు గ్రీన్ & బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ మన్నూరు సుగుణమ్మ ఆధ్వర్యంలో మహిళల కృతజ్ఞత కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూళ్లూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ మరియు రాష్ట్ర పార్టీ కార్యదర్శి, కందుకూరు నియోజకవర్గ పరిశీలకులు మట్టం శ్రావణి రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ను 2029 సార్వత్రిక ఎన్నికల్లో అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించిన నేపథ్యంలో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా మట్టం శ్రావణి రెడ్డి మాట్లాడుతూ మహిళలకు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించాలనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని అన్నారు. మహిళా సాధికారతకు టీడీపీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని, మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పించే దిశగా పార్టీ నాయకత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.అలాగే మహిళలు రాజకీయాల్లో మరింత చురుకుగా పాల్గొని నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.













