రాష్ట్ర ప్రజల చిరకాల కోరిక నెరవేరిన…వేళ
విశాఖపట్నంలో నేటి నుండి దక్షిణ కోస్తా జోన్ కార్యాలయం ప్రారంభం
విశాఖపట్నం: రాష్ట్ర ప్రజల చిరకాల కోరిక.. దక్షిణ కోస్తా రైల్వేజోన్ ఎట్టకే లకు పట్టాలెక్కింది. విశాఖపట్నం కేంద్రంగా సోమవారం నుంచి కార్యకలాపాలు ప్రారంభమవుతున్నాయి
దేశంలో 18వ రైల్వేజోన్‌గా దక్షిణ కోస్తా జోన్
నగరంలోని వీఎంఆర్డీఏ డెక్ భవనంలో జోనల్ తాత్కాలిక కార్యాల యాన్ని అధికారులు అందు బాటులోకి తెచ్చారు. జోన్‌కు సంబంధించిన మెకానికల్, టెలికమ్యూనికేషన్, సివిల్, ప్రధాన పరిపాలన వ్యవహారాలన్నీ అక్కడి నుంచే సాగనున్నాయి. సీపీఆర్వోనూ నియమించారు.
గుంటూరు,గుంతకల్, విజయవాడలతో పాటు విశాఖపట్నం కలిపి నాలుగు డివిజన్లతో జోన్ పని చేస్తుంది. 130 ఏళ్ల చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్ కనుమరుగైంది.
నిరాడంబరంగా దక్షిణ కోస్తా 18వ రైల్వే జోన్ ప్రారంభం కానుంది. గుంతకల్లు, గుంటూరు, విజయ వాడ, విశాఖ డివిజనల్ రైల్వే అధికారులతో జీఎం సందీప్ మాధుర్ సోమవారం సమావేశం కానున్నట్లు సమాచారం.
లాజిస్టిక్స్ హబ్‌గా మార్చడంలో కీలకం
రాష్ట్రాన్ని లాజిస్టిక్స్ హబ్ మార్చడంలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ కీలకమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను చరిత్రాత్మక మైలురాయిగా అభివర్ణించారు. ఏపీ ప్రజల చిర కాల ఆకాండ్లను ప్రధాని మోదీ, రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌లు నెరవేర్చారంటూ వారికి ధన్యవాదాలు తెలిపారు. ‘నూతన రైల్వేజోన్ ఉత్తరాంధ్ర రవాణా ముఖచిత్రాన్ని
సమూలంగా మారుస్తుంది. కొత్త ఉపాధి అవకాశాలకు, పారిశ్రామికాభివృద్ధికి బాటలు వేస్తుంది’ అని పేర్కొన్నారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త దిశ
ఆకాంక్ష అని, ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త దిశగా మారు దక్షిణ కోస్తా రైల్వేజోన్ ఆవిర్భావం ఆంధ్రుల దశాబ్దాల తుందని మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి అన్నారు. రాష్ట్ర అధ్యాయంలో జూన్ 1 చరిత్రాత్మక రోజుగా నిలిచిపోతుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైల్వే మౌలిక వసతుల విస్తరణ, కొత్త రైళ్లు, ప్రాజెక్టుల వేగవంతానికి జోన్ దోహదం చేస్తుందని, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.
ఉత్తరాంధ్రుల చిరకాల స్వప్నం
దక్షిణ కోస్తా రైల్వేజోన్ ఏర్పాటుతో ఉత్తరాంధ్రుల చిరకాల స్వప్నం నెరవేరిందని వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. జోన్ కార్యకలాపాలు ప్రారంభం కాబోతుండటంపై హర్షం వెలిబుచ్చారు సీఎం చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయని పేర్కొన్నారు.













