
మంగళగిరి:- మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంపై శిక్షణా కార్యక్రమంలో గూడూరు శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాశిం సునీల్ కుమార్ పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి, కందుకూరు నియోజకవర్గ పరిశీలకులు మట్టం శ్రావణి రెడ్డి కూడా పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్లమెంట్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, పరిశీలకులకు ఎన్నికల జాబితా సవరణ ప్రక్రియ, ఓటర్ల నమోదు, మార్పులు-చేర్పులు, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన చర్యలపై సమగ్ర అవగాహన కల్పించారు.ఓటర్ల జాబితాను పారదర్శకంగా, తప్పులులేకుండా రూపొందించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా సూచించారు. కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.














