
చావా వాసుదేవ రావు దాతృత్వం అభినందనీయం
సిఆర్. ఫౌండేషన్ కు ఎకరా వితరణ
సిఆర్. ఫౌండేషన్ అధ్యక్ష, గౌరవాధ్యక్షులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు, డాక్టర్ కె. నారాయణ వెల్లడి
చిల్లకూరు మండల పరిధిలోని పారిచేర్ల వారి పాలెంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త చావా వాసుదేవ రావుకి చెందిన ఎకరా భూమిని బుధవారం గూడూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సిఆర్ ఫౌండేషన్ కు రిజిస్ట్రేషన్ చేశారు.
ఈ సందర్భంగా సిఆర్. ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ కె. నారాయణ మాట్లాడుతూ గత మూడు దశాబ్దాలుగా సీఆర్. ఫౌండేషన్ అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు తెలిపారు.
హైదరాబాదులో ఉన్న ఓల్డ్ ఏజ్ హోమ్ దేశంలోనే అత్యంత పేరు ప్రతిష్టలు సంపాదించి 150 మంది సీనియర్ సిటిజన్లకు ఆసరాగా ఉందన్నారు.
సిఆర్. ఫౌండేషన్ తరపున ఒక మహిళ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, సీఆర్. పాలి క్లినిక్, ఎన్ఆర్ఆర్ రీసెర్చ్ సెంటర్, విశాలమైన గ్రంథాలయం, తదితర కార్యకలాపాలు విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే గుంటూరులో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో సీఆర్. ఫౌండేషన్ పేరుతో ఓల్డ్ ఏజ్ హోమ్, అనాధ పిల్లల ఆశ్రమం
నిర్మించనున్నట్లు తెలిపారు. కడపలో మూడు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఆశ్రమాన్ని వచ్చే నెల ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా గూడూరులో చావా వాసుదేవరావు దాతృత్వంలో వారి సతీమణి, కుమారుడు చావా హర్షవర్ధన్ పేరుతో సీఆర్. ఫౌండేషన్ కు అనుబంధంగా
ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కే.నారాయణ, ముప్పాళ్ళ నాగేశ్వరరావు వాసుదేవరావు, ఆయన కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ. రామానాయుడు,
బీకేఎంయు రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్. ప్రభాకర్, చావా వాసుదేవ రావు, ఆయన కుమారుడు చావా హర్షవర్ధన్,
అమరావతి హాస్పిటల్ అధినేతలు డాక్టర్ రమణయ్య, డాక్టర్ నిర్మల, సీపీఐ గూడూరు నియోజకవర్గ కార్యదర్శి జి. శశికుమార్,
పట్టణ కన్వీనర్ సునీల్ తదితరులు పాల్గొన్నారు.












