
గూడూరు నియోజకవర్గం, కోట మండలం: కోట మండల పరిషత్ అధ్యక్ష (MPP) ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంబేటీ శశి మెజారిటీ సభ్యుల మద్దతుతో MPPగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గూడూరు శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాశం సునీల్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోట మండలంలో జరిగిన MPP ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఎంబేటీ శశి విజయం సాధించడం ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమన్నారు. అవతలి పార్టీ వారు ప్రత్యర్థి ని బరిలోకి దింపలేకపోవడం వారి బలహీనతను స్పష్టంగా చూపిస్తోందని పేర్కొన్నారు.కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులైన మెజారిటీ MPTC సభ్యులు తమకు మద్దతు తెలపడంతో ఈ విజయం సాధ్యమైందన్నారు. కోట మండల అభివృద్ధికి మరింత కృషి చేస్తామని, ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ తెలిపారు.ఈ విజయానికి సహకరించిన ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.












