
గూడూరు, జూన్ 4: గూడూరు మండలంలోని గాంధీనగర్ సెక్టార్ పరిధిలోని చవటపాళెం-III అంగన్వాడి కేంద్రంలో బుధవారం “అంగన్వాడి పిలుస్తోంది” కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఐసీడీఎస్ సీడీపీఓ మొహబూబ్ మేడం మాట్లాడుతూ, మూడు సంవత్సరాలు నిండిన ప్రతి చిన్నారి తప్పనిసరిగా అంగన్వాడి కేంద్రాలకు హాజరు కావాలని తల్లిదండ్రులకు సూచించారు. అంగన్వాడి కేంద్రాల్లో పిల్లలకు ఆటలు, పాటల ద్వారా బోధన అందించడంతో పాటు పోషకాహారంతో కూడిన భోజనం అందిస్తున్నట్లు తెలిపారు.అలాగే పీపీ-1, పీపీ-2 ప్రీ-స్కూల్ కార్యక్రమాలను నిర్వహిస్తూ చిన్నారులలో జ్ఞాన వికాసం, సృజనాత్మకత, సామాజిక నైపుణ్యాల పెంపొందింపుకు కృషి చేస్తున్నామని వివరించారు. పిల్లలకు విద్యతో పాటు మంచి అలవాట్లు, పాటలు, వినోదాత్మక బోధన అందిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏసీడీపీఓ శారద మేడం, సూపర్వైజర్ నీరుప్రాణి, అంగన్వాడి కార్యకర్త ఎస్. కృష్ణవేణి, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.












