చిట్టమూరు మండలం గుణపాడులో అభివృద్ధి పనుల ప్రారంభం

చిట్టమూరు మండలం, గుణపాడు: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్రీ పాశం సునీల్ కుమార్ అన్నారు.

చిట్టమూరు మండలం గుణపాడు గ్రామంలో సుమారు రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన పంట కాలువ (డ్రైన్) మరియు రూ.14 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు.

అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధి ద్వారానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. రైతులకు సాగునీటి సౌకర్యాలు మెరుగుపడేందుకు పంట కాలువలు, గ్రామాల్లో రాకపోకలకు ఇబ్బందులు లేకుండా నాణ్యమైన రహదారుల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. గుణపాడు గ్రామ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ పనులు పూర్తవడం ఆనందదాయకమని అన్నారు.

ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని, తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, విద్యుత్ వంటి రంగాల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam