“ప్రతి అర్హుడికి ఓటు హక్కు అందేలా కృషి చేయాలి” అని ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ పిలుపునిచ్చారు.
గూడూరు, జూన్ 6: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా గూడూరు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో క్లస్టర్, యూనిట్ ఇంచార్జ్‌లతో గూడూరు శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాశం సునీల్ కుమార్ గారు సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, జూన్ 15 నుంచి జూలై 15 వరకు నిర్వహించనున్న ఓటరు జాబితా ప్రత్యేక పరిశీలన కార్యక్రమాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో విజయవంతం చేయాలని సూచించారు. ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించి, కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పులు, పేర్ల సవరణలు, మరణించిన వారి పేర్ల తొలగింపు వంటి అంశాలను సంబంధిత బీఎల్ఓల (BLO) సహకారంతో నమోదు చేయించాలని ఆదేశించారు.ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. ఓటరు జాబితా పకడ్బందీగా ఉండటం ఎన్నికల పారదర్శకతకు ఎంతో అవసరమని పేర్కొన్నారు.క్లస్టర్, యూనిట్ ఇంచార్జ్‌లకు దిశానిర్దేశం చేస్తూ, ప్రతి బూత్ పరిధిలోని ఓటర్ల వివరాలపై పూర్తి అవగాహనతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఓటరు నమోదు ప్రక్రియను సులభతరం చేయాలని కోరారు.
ఈ సమావేశంలో పార్టీ నాయకులు, క్లస్టర్ ఇంచార్జ్‌లు, యూనిట్ ఇంచార్జ్‌లు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.














