తిరుపతిలో మెగా డ్రగ్స్ టెస్టింగ్ కార్యక్రమం


తిరుపతి, జూన్ 6: మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా తిరుపతి జిల్లా పోలీసులు శనివారం తిరుపతి నగరంలోని ఇందిరా మైదానంలో మెగా డ్రగ్స్ టెస్టింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర డీజీపీ ఆదేశాలు, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ డీఎస్పీ భక్తవత్సలం ఆధ్వర్యంలో సీఐలు, ఈగల్ సెల్ సిబ్బంది పాల్గొన్నారు.యువత మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడటం, గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడం లక్ష్యంగా అనుమానిత వ్యక్తులకు డ్రగ్స్ టెస్టులు నిర్వహించారు. అలాగే రౌడీషీటర్లు, అనుమానిత వ్యక్తులకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించి నేరాలు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.డ్రగ్స్ టెస్టుల్లో పాజిటివ్‌గా గుర్తించిన వారికి చట్టపరమైన చర్యలతో పాటు కౌన్సిలింగ్ అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1972 (ఈగల్) లేదా 112కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు ఎస్పీ విజ్ఞప్తి చేశారు.”డ్రగ్స్ ఫ్రీ తిరుపతి జిల్లా” లక్ష్యంతో ఇటువంటి ప్రత్యేక కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

error: Content is protected !!
Prajaveek Shanam