జాతీయ స్థాయి నృత్య పోటీల్లో విజేతలైన గూడూరు సిస్టర్స్‌కు ఎమ్మెల్యే సునీల్ కుమార్ సత్కారం

గూడూరు పట్టణం: సంస్కృతి సమ్మేళనం సంస్థ ద్వారా నృత్యంలో శిక్షణ పొందిన గూడూరుకు చెందిన సిస్టర్స్ గోవాలో నిర్వహించిన జాతీయ స్థాయి నృత్య పోటీల్లో విజేతలుగా నిలిచి ప్రతిభ చాటుకున్నారు.ఈ సందర్భంగా గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాశిం సునీల్ కుమార్ విజేతలను శాలువాతో సత్కరించి అభినందించారు. జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చి గూడూరు ప్రాంతానికి మంచి గుర్తింపు తీసుకువచ్చినందుకు వారిని ప్రశంసించారు.కళలు, సాంస్కృతిక రంగాల్లో యువత ముందుకు రావాలని, తమ ప్రతిభను మరింత మెరుగుపరుచుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి రాష్ట్రానికి, జిల్లాకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

error: Content is protected !!
Prajaveek Shanam