గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్‌ను కలిసిన మాజీ ఎంపీ వరప్రసాద్ రావు

గూడూరు పట్టణంలోని శాసనసభ్యుల నివాసంలో గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాశం సునీల్ కుమార్‌ను మాజీ తిరుపతి పార్లమెంట్ సభ్యుడు, మాజీ శాసనసభ్యుడు డాక్టర్ వెలగపల్లి వరప్రసాద్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఇరువురు నాయకులు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకుని, నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలు, రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం.

గూడూరు నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల అమలుపై కూడా వారు అభిప్రాయాలు పంచుకున్నట్లు తెలిసింది. అనంతరం డాక్టర్ పాశం సునీల్ కుమార్‌కు డాక్టర్ వెలగపల్లి వరప్రసాద్ రావు శుభాకాంక్షలు తెలియజేశారు.

error: Content is protected !!
Prajaveek Shanam