కోవూరు సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు కార్మికులకు గాయాలు


కోవూరు: నెల్లూరు జిల్లా కోవూరు సమీపంలోని జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నేషనల్ హైవే ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద రోడ్డు మార్కింగ్ పెయింటింగ్ పనులకు బైక్‌పై వెళుతున్న ఇద్దరు కార్మికులను వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారు నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్‌కు చెందిన పెయింటింగ్ కార్మికులుగా గుర్తించారు.
ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

error: Content is protected !!
Prajaveek Shanam