కుందన్ జన్మదిన వేడుకలు స్ఫూర్తిదాయకం : జిపీఎండబ్ల్యూఏ అధ్యక్ష, ప్రధాన కార్యదర్సులు

గూడూరు సీనియర్ పాత్రికేయులు కిషోర్ కుమారుడు కుందన్ జన్మదిన వేడుకలను గురువారం గూడూరు రెండవ పట్టణంలోని బాలసదన్ లో అనాధ పిల్లల నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా బాలసదన్ లో కిషోర్, సౌజన్య దంపతులు కుందన్ చేతులమీదుగా కేక్ కట్ చేసి అనాధ పిల్లల నడుమ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వాహించారు. అలాగే బాలసదన్ లోని అనాధ బాలికలకు, పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ వేడుకలకు హాజరైన గూడూరు ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ జమాలుల్లా, ఉడతా శరత్ కుమార్ లు మాట్లాడుతూ అనేక మంది తల్లి దండ్రులు తమ పిల్లల జన్మదిన వేడుకలను ఎంతో ఆడంబరంగా నిర్వహిస్తుంటారన్నారు. కానీ కిషోర్ తన కుమారుడు కుందన్ జన్మదిన వేడుకలను బాలసదన్‌లో అనాధ పిల్లల నడుమ నిరాడంబరంగా నిర్వహించడం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లల జన్మదిన వేడుకలను అనాధశ్రమాలలో, వృద్ధాశ్రమాలలో నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఇంటిల్లిపాది ఈ వేడుకలలో పాల్గొనాలన్నారు. పదిమందికి సహాయం చేశామనే సంతృప్తి కలుగుతుందన్నారు. ఆ ఆనందం, అనుభూతి కోట్ల రూపాయల సంపాదన కంటే విలువైందన్నారు. సేవా భావం కలిగిన వారు మాత్రమే ఆ ఆనందాన్ని ఆస్వాదించగలరన్నారు. కిషోర్, సౌజన్య దంపతుల సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జీపీఎండబ్ల్యూ కార్యవర్గ సభ్యులు చిట్టేటి వెంకట నిరంజన్, కిషోర్, సౌజన్య, కుందన్, దక్షిత, బాలసదన్ సిబ్బంది, చిన్నారులు, తదితరులు పాల్గొన్నారు.












