
గూడూరు అర్బన్ మండల బిజెపి. అధ్యక్షులు కే దయాకర్ జన్మదిన వేడుకలను పార్టీ కార్యాలయంలో పట్టణ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా బర్తడే కేక్ ను కట్ చేసి అందరికి పంచిపెట్టి సంబరాల నిర్వహించారు. పట్టణ అధ్యక్షులకు పట్టణ పార్టీ కమిటీ సభ్యులు, నాయకులు శాలువాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ బాలకృష్ణ నాయుడు మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే అతిపెద్ద పార్టీ అయినా భారతీయ జనతా పార్టీకి గూడూరు పట్టణ అధ్యక్షులుగా బాధితులు చేపట్టి పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా చేస్తూ జిల్లా వ్యాప్తంగా ముందంజలో ఉన్నాడని అలాంటి దయాకర్ మరెన్నో జన్మదిన వేడుకలను చేపట్టాలని పార్టీలో రాష్ట్రస్థాయికి ఎదగాలని దేవదేవుని ప్రార్థిస్తున్నాను అన్నారు. ఈ సందర్భంగా జన్మదిన వేడుకలు జరుపుకున్న దయాకర్ మాట్లాడుతూ నాపై ఎంతో ప్రేమాభిమానం చూపి నా జన్మదిన వేడుకలను పార్టీ కమిటీ సభ్యులు కార్యకర్తలు మధ్య జరుపుకోవడం నాకు ఎంత ఆనందంగా ఉందన్నారు. నేను చేసే ప్రతి కార్యక్రమంలో నాకు సహకరిస్తూ నన్నెంతో ముందుకు తీసుకెళుతున్న పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మధిర సునీల్ కుమార్, మోర్చా అధ్యక్షులు కటికల సురేష్, యువ మోర్చా అధ్యక్షులు శివకుమార్, ఎస్సీ మోర్చా అధ్యక్షులు మధుసూదన్, పట్టణ కమిటీ కోశాధికారి నిరంజన్, కార్యదర్శి ఇంద్రవర్ధన్ , మహిళా నాయకురాలు పద్మమ్మ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.














