
గూడూరు పట్టణ మున్సిపాలిటీ నూతన కమిషనర్‌గా వై. మల్లికార్జునరావు బాధ్యతలు స్వీకరించారు. గతంలో సెక్షన్ ఆఫీసర్‌గా ఏపీఎస్ విధులు నిర్వహించిన ఆయన, డిప్యుటేషన్‌పై పదోన్నతి పొంది తన తొలి పోస్టింగ్‌గా గూడూరు మున్సిపల్ కమిషనర్గానియమితులయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గూడూరు వంటి అభివృద్ధి చెందుతున్న పట్టణంలో కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. పట్టణ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, మున్సిపాలిటీ పరిధిలోని అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానన్నారు.
పారిశుధ్యం, తాగునీటి సరఫరా, రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, పట్టణ సుందరీకరణ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ గూడూరు సమగ్ర అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని చెప్పారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తానని, ప్రజల సహకారంతో గూడూరును ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తానని నూతన కమిషనర్ వై. మల్లికార్జునరావు పేర్కొన్నారు.












