
తిరుపతి, జూన్ 12: తిరుపతి లో జరుగుతున్న కార్యక్రమం లో మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తైన సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి నారా లోకేశ్ వివరించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు.
ప్రభుత్వం చేపట్టిన ముఖ్య కార్యక్రమాలను ప్రస్తావిస్తూ, గతంలో రూ.2 వేలుగా ఉన్న సామాజిక భద్రతా పెన్షన్ను ఒకేసారి రూ.4 వేలుకు పెంచినట్లు తెలిపారు. పేదలకు తక్కువ ధరలో భోజనం అందించే అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించామని పేర్కొన్నారు.ఉద్యోగాల కల్పనలో భాగంగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసినట్లు, 6 వేల కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేసినట్లు తెలిపారు. అలాగే జాబ్ క్యాలెండర్ ద్వారా మరో 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినట్లు వెల్లడించారు.
చేనేత కార్మికులకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, పవర్లూమ్ యజమానులకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆటో డ్రైవర్లు, మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.అన్నదాత సుఖీభవ, స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం, దీపం-2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ వంటి కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని చెప్పారు. అలాగే ‘తల్లికి వందనం’ పథకం ద్వారా కుటుంబంలో ఉన్న ప్రతి అర్హత గల విద్యార్థికి ప్రయోజనం కల్పిస్తున్నట్లు వివరించారు.ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తామని లోకేశ్ తెలిపారు.












