తిరుపతి, జూన్ 12 : తిరుపతిలో నిర్వహించిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన సందర్భంగా ఏర్పాటు చేసిన “నమ్మకం – సంక్షేమం – అభివృద్ధి” విజయోత్సవ సభ ప్రాంగణంలో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ విజయోత్సవ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్‌తో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు మరియు కూటమి నేతలు హాజరయ్యారు.
సభకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కూటమి శ్రేణులు, అభిమానులు, ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను నాయకులు సభలో వివరించారు.













