ప్రసన్న వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక విడుదల-

ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ చేతుల మీదుగా ఆవిష్కరణ

గూడూరు జూన్ 15 (ప్రజా వీక్షణం)

గూడూరు పట్టణంలోని రాజా వీధిలో వెలసి ఉన్న  ప్రసన్న వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో జూన్ 24 నుంచి జూలై 4 వరకు నిర్వహించనున్న 28వ వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను సోమవారం గూడూరు శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాశం సునీల్ కుమార్ తన నివాసంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దేవస్థానం చైర్మన్ మరియు ధర్మకర్త మండలి సభ్యుల ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని సూచించారు. ఆలయంలో జరిగే అన్ని కార్యక్రమాలను దగ్గరుండి పర్యవేక్షించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
దేవస్థానం చైర్మన్ కంటి రామ్మోహన్ రావు మాట్లాడుతూ, స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేను ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలిపారు. ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి రవికృష్ణ, ధర్మకర్త మండలి సభ్యులు పేపళ్ల అమరయ్య నాయుడు, మంగళపూర్ గోపాల్, పర్వతాల నాగేంద్ర, కొమ్మా రవీంద్రబాబు, ఓబిలి బాబు, సాయి కృష్ణ, మునికోటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam