
గూడూరు (ప్రజావీక్షణం) జూన్ 15
గూడూరు మున్సిపాలిటీ నూతన కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన వై. మల్లికార్జునరావుకు ప్రసన్న వెంకటేశ్వరస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు.గూడూరు పట్టణంలోని రాజా వీధిలో వెలసి ఉన్న ప్రసన్న వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో జూన్ 24 నుంచి జూలై 4 వరకు నిర్వహించనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని కోరుతూ దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడు, తెలుగుదేశం పార్టీ గూడూరు పట్టణ మాజీ కార్యదర్శి పేపళ్ల అమరయ్య నాయుడు కమిషనర్‌కు ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, ఉత్సవాల విశిష్టత, భక్తుల రద్దీకి అనుగుణంగా చేపడుతున్న ఏర్పాట్లపై చర్చించినట్లు తెలిపారు.













