
నెల్లూరు ప్రజావీక్షణం జూన్ 16
రాష్ట్ర హోంమంత్రి అనితపై మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎమ్మెల్యే మరియు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాశిం సునీల్ కుమార్ అన్నారు.నెల్లూరులో నిర్వహించిన ఎన్డీఏ కూటమి రెండేళ్ల విజయోత్సవ సభలో పాల్గొన్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, దళిత మహిళలు, వారి వస్త్రధారణ, వ్యక్తిగత అంశాలపై వ్యాఖ్యలు చేయడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడటం సమాజం అంగీకరించదని అన్నారు.ప్రజలు ఇటువంటి రాజకీయాలను తిరస్కరించారని, మహిళల గౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు చేసే నాయకులు తమ వైఖరిని మార్చుకోవాలని సూచించారు. రాజకీయాల్లో పరస్పర గౌరవం, సంస్కారం పాటించడం అవసరమని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు నెల్లూరులోని కస్తూరి గార్డెన్స్‌లో నిర్వహించిన ఎన్డీఏ కూటమి రెండేళ్ల విజయోత్సవ సభలో జిల్లా ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన పాల్గొన్నారు.












