రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యాసామాగ్రి పంపిణీ

చిల్లకూరు మండలం కడివేడు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నులు, పలకలు తదితర విద్యాసామాగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, గూడూరు కుమ్మరి వీధికి చెందిన శ్రీ మహాలక్ష్మి జువెలరీ అధినేత, రోటేరియన్ ఎస్‌ఎల్‌ఎన్ బాబు దాతృత్వంతో విద్యార్థులకు అవసరమైన విద్యాసామాగ్రిని అందజేయడం అభినందనీయమన్నారు.
రోటరీ వెస్ట్ క్లబ్ విద్య, వైద్య రంగాల్లో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజానికి తోడ్పాటునందిస్తోందని తెలిపారు. విద్యార్థులు విద్యలో రాణించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి రాఘవరెడ్డి, వాసుగౌడ్, దాత ఎస్‌ఎల్‌ఎన్ బాబు, సనత్ రెడ్డి, ఆడిటర్ రామ్మోహన్‌రావు, కోట కృష్ణ, నేలకాస్ట్ రవీందర్ రెడ్డి, హరినాథ్ రెడ్డి, బలరామిరెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam