
గూడూరు, జూన్ 20: జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) నిర్వహణ నేపథ్యంలో గూడూరు పట్టణంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని ఆర్డీఓ అరుణకుమారి శనివారం పరిశీలించారు.
పరీక్ష నిర్వహణ ఏర్పాట్లు, అభ్యర్థులకు కల్పించిన సౌకర్యాలు, భద్రతా చర్యలు, తాగునీరు, వైద్య సదుపాయాలు తదితర అంశాలను ఆమె పరిశీలించి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆర్డీఓ అరుణకుమారి మాట్లాడుతూ, నీట్ వంటి ప్రతిష్టాత్మక ప్రవేశ పరీక్షలను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి పరీక్షను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు.
ఈ సందర్భంగా ఆమె వెంట డిప్యూటీ తహసీల్దార్ చైతన్య, ఆర్ ఐ పూర్ణ ,రెవెన్యూ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.













