బాలసదన్లో ఘనంగా శరత్ యాదవ్ జన్మదిన వేడుకలు

చిన్నారులకు పండ్లు, రొట్టెలు పంపిణీ

జీపీఎండబ్ల్యూ ప్రధాన కార్యదర్శి ఉడతా శరత్ యాదవ్

(గూడూరు) జూన్ 20

గూడూరు రెండవ పట్టణంలోని బాలసదన్లో శనివారం గూడూరు ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, షోకాజ్ పత్రిక సంపాదకులు ఉడతా శరత్ యాదవ్ జన్మదిన వేడుకలను ఆ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గూడూరు ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు షేక్ జమాలుల్లా, పరుచూరి బాలకృష్ణలు మాట్లాడుతూ తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల జన్మదిన వేడుకలను పురస్కరించుకుని సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలనే ఉద్దేశంతో బాలసదన్లో అనాధ బాలల నడుమ జన్మదిన వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే గతంలోనూ బాలసదన్లో దుప్పట్ల పంపిణీ, పలువురు పాత్రికేయుల జన్మదిన వేడుకలను నిర్వహించినట్లు తెలిపారు. తమ అసోసియేషన్ తరపున బాలసదన్లో బాలికల విద్యావసరాలను తీర్చేందుకు కృషి చేస్తామన్నారు. అనాధ పిల్లల నడుమ శరత్ జన్మదిన వేడుకలు నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించిన వార్డెన్ అరుణమ్మకు కృతజ్ఞతలు తెలిపారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఉడతా శరత్ యాదవ్ మాట్లాడుతూ జన్మదిన వేడుకలను అనాధ బాలికల నడుమ నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అనంతరం విలేకరులు, చిన్నారుల నడుమ కేక్ కట్ చేశారు. చిన్నారులకు కేక్, పండ్లు పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో బాలసదన్ వార్డెన్ పి. అరుణమ్మ, విలేకరులు సురేష్, కిషోర్ నాయుడు, నిరంజన్, సలీం, గోపీ, రవి, కృపానిధి, రమణయ్య, తలారి నాగరాజు, మస్తాన్, కోటి తదితరులు పాల్గొన్నారు

error: Content is protected !!
Prajaveek Shanam