
అక్రమ మద్యం విక్రయాలపై ప్రత్యేక నిఘా ప్రజలు సమాచారం అందించాలి
గూడూరు, జూన్ 21 : గూడూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో అక్రమ మద్యం విక్రయాలు, బెల్ట్ షాపుల నిర్వహణను అరికట్టేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని ఎక్సైజ్ సీఐ ఎస్.కె. కరీమా బేగం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బహిరంగ ప్రదేశాలు, గ్రామాలు, అనుమానాస్పద ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నామని ఆమె పేర్కొన్నారు.అక్రమంగా మద్యం విక్రయించడం, నిల్వ ఉంచడం, రవాణా చేయడం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా అక్రమ మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే ఎక్సైజ్ శాఖకు సమాచారం అందించాలని కోరారు.ప్రజల సహకారంతో అక్రమ మద్యం విక్రయాలను పూర్తిగా నిర్మూలించేందుకు కృషి చేస్తున్నామని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని సీఐ ఎస్.కె. కరీమా బేగం తెలిపారు.












