ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమంపై విస్తృత చర్చ

తిరుపతి పార్లమెంటరీ కమిటీ సర్వసభ్య సమావేశం శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి నివాసంలో ఘనంగా నిర్వహించారు. పార్లమెంటరీ కమిటీ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, కార్యదర్శి డాలర్ దివాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ప్రస్తుతము కొనసాగుతున్న సమగ్ర సవరణ ఓటరు జాబితా (ఎస్ఎస్ఆర్) కార్యక్రమంపై విస్తృతంగా చర్చించారు.ఈ సందర్భంగా ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రతి అర్హుడైన ఓటరు పేరు జాబితాలో నమోదు కావడంతో పాటు, తప్పుల సవరణ, చిరునామా మార్పులు, కొత్త ఓటర్ల నమోదు వంటి అంశాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో పాల్గొన్న వివిధ నియోజకవర్గాల శాసనసభ్యులు ఎస్ఎస్ఆర్ కార్యక్రమం ప్రాధాన్యతను వివరించి, గ్రామస్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పార్టీ శ్రేణులు చురుకుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఖచ్చితమైన ఓటరు జాబితా ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు.
ఈ సమావేశానికి తిరుపతి జోనల్ కోఆర్డినేటర్ దామంచర్ల సత్య, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, సత్యవేడు నియోజకవర్గ ఇన్చార్జి శంకర్ రెడ్డి, తిరుపతి ఇన్చార్జి సుగుణమ్మతో పాటు. తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి ఎండీ అబ్దుల్ రహీమ్, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులు ఏసుపాకు పెంచలయ్య,పార్లమెంటరీ కమిటీలోని వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.సమావేశం విజయవంతంగా నిర్వహించబడగా, రాబోయే రోజుల్లో ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందించినట్లు నాయకులు తెలిపారు.













