తిరుపతి పార్లమెంట్ టీడీపీ నాయకుల కీలక సమావేశం


శ్రీకాళహస్తి, జూన్ 23:

తిరుపతి పార్లమెంట్ పరిధిలో పార్టీ బలోపేతం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలు, రానున్న రాజకీయ కార్యాచరణపై తెలుగుదేశం పార్టీ నాయకులు కీలక సమావేశం నిర్వహించారు.శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నివాసంలో జరిగిన ఈ ఆత్మీయ సమావేశంలో రాష్ట్ర ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, రీజనల్ కోఆర్డినేటర్ దామచర్ల సత్య, తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, సత్యవేడు ఇన్‌చార్జ్ శంకర్ రెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్ చైర్‌పర్సన్ సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడం, క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తల సమన్వయంతో ప్రజలకు మరింత చేరువ కావడం, ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.అనంతరం తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, పార్టీ కార్యక్రమాల అమలు, సభ్యత్వ నమోదు, స్థానిక సమస్యల పరిష్కారం, భవిష్యత్ కార్యాచరణపై నాయకులకు దిశానిర్దేశం చేశారు.పార్టీ విజయానికి నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని సమావేశంలో పాల్గొన్న నేతలు పిలుపునిచ్చారు.

error: Content is protected !!
Prajaveek Shanam