గూడూరు ఎక్సైజ్ అధికారులుప్రత్యేక తనిఖీల్లో అక్రమ మద్యం స్వాధీనం

ప్రజా వీక్షణం (గూడూరు) జూన్ 26

అక్రమ మద్యం విక్రయాలు, నిల్వలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై గూడూరు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ అధికారులు వరుస దాడులు నిర్వహిస్తూ కఠిన చర్యలు చేపడుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం గూడూరు రూరల్ మండల పరిధిలో విస్తృత ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా వెడిచర్ల గ్రామంలోని సీతాలమ్మ గుడి సమీపంలో నిర్వహించిన తనిఖీలలో మీసాల కోటేశ్వరయ్య అనే వ్యక్తి అక్రమంగా మద్యం బాటిళ్లు కలిగి ఉండగా గుర్తించారు. వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.అధికారులు మాట్లాడుతూ, అక్రమ మద్యం విక్రయాలు, అక్రమ నిల్వలు, అనుమతి లేకుండా మద్యం రవాణా చేయడం, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం వంటి చట్టవిరుద్ధ చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు. ప్రజల ఆరోగ్యం, శాంతిభద్రతల పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ప్రజలు చట్టాన్ని గౌరవించి అక్రమ మద్యం వ్యవహారాలకు దూరంగా ఉండాలని, ఎక్కడైనా అక్రమ మద్యం విక్రయాలు లేదా నిల్వలపై సమాచారం తెలిసిన వెంటనే ఎక్సైజ్ శాఖకు తెలియజేయాలని కోరారు. ప్రజల సహకారంతో అక్రమ మద్యం నిర్మూలనకు మరింత సమర్థవంతంగా చర్యలు చేపడతామని పేర్కొన్నారు.
ఈ ప్రత్యేక తనిఖీలలో సబ్-ఇన్స్పెక్టర్ ఎ. శేషమ్మ, హెడ్ కానిస్టేబుల్ బి. వేణుగోపాల్, కానిస్టేబుల్ టి. మనోహర్ పాల్గొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam